దేశం లో ఇప్పటికే 7 విడతల ఎన్నికల ముగిసాయి. మొత్తం 543 పార్లమెంటు స్థానాలకు గాను ఒక పార్లమెంటు సీటు ఇప్పటికే ఏకగ్రీవమైంది. మిగతా స్థానాల్లో బిజెపి, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల మధ్య హోరా హోరీ పోరు ఏర్పడింది. ఎవరు గెలుస్తారు అని చెప్పడం కష్టంగా మారింది. ఇదే తరుణంలో ఎగ్జిట్ పోల్స్ అందుబాటులోకి వచ్చాయి. చాలా సర్వే సంస్థలు అందించినటు వంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు బిజెపి కి అనుకూలంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ తరుణం లో అత్యంత ప్రముఖమైనటు వంటి సంస్థ ఆదాన్ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేసింది.
ఈ ఫలితాలలో ఇండియా కూటమి కే ఎక్కువగా సీట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకీ బీజేపీ కి వచ్చిన సీట్లు ఏంటయ్యా అంటే ఎన్డీఏ కూటమికి 346 నుంచి 360 సీట్లు వస్తాయని, ఇండియా కూటమి కి 127 నుంచి 136 వస్తాయని తెలియజేసింది. అంతేకాకుండా ఇతరులు 44 నుంచి 53 వరకు గెలుచుకుంటారని తెలియజేసింది. ఇదే తరుణం లో కేంద్రం లో మరోసారి బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. మరి చూడాలి ఈ ఎగ్జిట్ ఫలితాలు నిజమవుతాయా లేదంటే జూన్ నాలుగో తేదీన తారుమారు అవుతాయా అనేది ముందు ముందు తెలుస్తోంది.
కానీ ఇదే తరుణంలో ఇండియా కూటమి మాత్రం తప్పక మాకు కూడా 350 పైగా సీట్లు వస్తాయని తెలియజేస్తోంది. ఇక బిజెపి మాత్రం 400 దాటుతాయని అంటున్నది. ఇలా ఎవరి అంచనాలు వారికే ఉన్నాయి. కానీ చాలామంది ప్రజల నోటి నుంచి వచ్చిన మాటల ప్రకారం చూస్తే మాత్రం బిజెపి మూడవసారి అధికారంలోకి వచ్చేటట్లు కనిపిస్తోంది. మరి ఈసారి ప్రధాని ఎవరు అవుతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. మరి మరోసారి మోడీ అవుతారా లేదంటే అమిత్ షా ఆస్థానాన్ని భర్తీ చేస్తారా.. లేదంటే యోగి ఆదిత్యనాథ్ ప్రధాని స్థానంలోకి వస్తారా అనేది జూన్ నాలుగు తర్వాత తెలుస్తుంది.