ఏపీ ఎగ్జిట్ పోల్స్: కూటమిదే అధికారమా.. ఈ సర్వేలన్నీ వైసీపీకి షాక్ ఇస్తున్నాయే..??

Suma Kallamadi
నేటితో భారతదేశంలో అన్ని ఎన్నికలు ముగిసాయి. దీంతో లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ ఒక్కోటిగా రిలీజ్ అవుతున్నాయి. అయితే అందరి దృష్టి ఏపీ అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనే పడింది. ఈ నేపథ్యంలో ఏయే సర్వేలలో ఏయే పార్టీలకు ఎన్ని ఓట్లు వస్తాయని చెబుతున్నారో పదండి. పీపుల్స్ పల్స్ సర్వే చూస్తే టీడీపీ 95-110, జనసేన 14-20, బీజేపీ 2-5, వైసీపీ 45-60 గెలుచుకోనున్నాయి. ప్రిజమ్ ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వే చూస్తే కూటమికి 110, వైసీపీకి 60 సీట్లు రానున్నాయి. రీపబ్లిక్ టీవీ సర్వే ఎన్డీఏ 359, ఇండియా 154, అదర్స్ 30 విన్ అవుతారని తెలిపింది. చాణక్య స్ట్రాటజీస్ అంచనా కూటమి 114-125, వైసీపీ 39-49 సీట్లు
కేకే ఎగ్జిట్ పోల్స్‌ కూటమి 161, వైసీపీ 14 సీట్లు మాత్రమే గెలుచుకోబోతోందని చెప్పడం విశేషం. వైసిపి మరీ 20 సీట్లకు పడిపోతుంది అని ఇప్పటిదాకా ఏ సర్వే కూడా తెలపలేదు మరి ఏ లెక్కన వీరు అంత తక్కువ సీట్లకు వైసిపి పడిపోతుందని చెబుతున్నారు తెలియాల్సి ఉంది.
టీవీ9 - పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్ : ఏపీ లోక్‍సభ : వైసీపీ-13, టీడీపీ-9, బీజేపీ-2, జనసేన-1 అని అంచనా వేసి వైసిపి నేతలలో కాస్త జోష్ పెంచింది. ఇక S-GED సర్వే ఏపీ అసెంబ్లీ టీడీపీ కూటమి 139, వైసీపీ 36 సీట్లు విన్ కానున్నాయని చెప్పింది. NFOPL సర్వే ఏపీ అసెంబ్లీ సర్వే చూసుకుంటే టీడీపీ కూటమి 104-110, వైసీపీ 65-71 సీట్లు గెలుసుకోబోతున్నాయి. ఇండియా టీవీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ : టీడీపీ 13-15, వైసీపీ 3-5, జనసేన 2, బీజేపీ 4-6 సీట్లు వస్తాయని అంచనా వేస్తే SAN సర్వే ఏపీ అసెంబ్లీ : టీడీపీ కూటమి 127, వైసీపీ 48 సీట్లలో గెలుపు సాధిస్తుందని అంచనా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: