సీఎం జగన్ వన్స్ మోర్ అని చెబుతున్న సర్వేలు ఇవే.. ఏ సర్వే లెక్కలు ఎంతంటే?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ మళ్లీ జగన్ సీఎం అని మెజారిటీ సర్వేలు తేల్చి చెబుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి ఫ్యాన్ కు తిరుగులేదని ఎగ్జిట్ పోల్స్ లెక్కలతో వెల్లడైంది. జగన్ ప్రభుత్వానికే ఏపీ ప్రజలు జై కొట్టనున్నారని కామెంట్లు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఏపీలో 98 నుంచి 116 స్థానాల్లో వైసీపీ విజయం సాధించనుంది. అదే సమయంలో కూటమి కేవలం 59 నుంచి 77 స్థానాలకు పరిమితం కానుంది.
 
రేస్ సంస్థ సర్వే లెక్కల ప్రకారం వైసీపీ 117 నుంచి 120 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలుండగా కూటమి కేవలం 48 నుంచి 50 స్థానాలకు పరిమితం కానుంది. పోల్స్ స్ట్రాటజీ గ్రూప్ లెక్కల ప్రకారం వైసీపీ 115 నుంచి 125 స్థానాలతో అధికారాన్ని సొంతం చేసుకోనుంది. టీడీపీ కేవలం 50 నుంచి 60 స్థానాలకు పరిమితం కానున్నాయి. ఆపరేషన్ చాణక్య సర్వేలో వైసీపీ 95 నుంచి 102 స్థానాల్లో విజయం సాధించనుంది.
 
కూటమి కేవలం 64 నుంచి 68 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. చాణక్య పార్థదాస్ సర్వే ప్రకారం వైసీపీ 110 నుంచి 120 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉండగా కూటమి 55 నుంచి 60 స్థానాలకు పరిమితం కానుంది. పోల్స్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే లెక్కల ప్రకారం వైసీపీ 115 నుంచి 125 స్థానాలకు పరిమితం కాగా టీడీపీ 50 నుంచి 60 స్థానాలకు పరిమితం కానుంది.
 
జన్మత్ సర్వే లెక్కలు సైతం ఫ్యాన్ కే ఏపీ ప్రజలు ఓటేశారని చెబుతుండటం గమనార్హం. వైసీపీ 95 నుంచి 103 స్థానాలలో కూటమి 67 నుంచి 75 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. జగనన్న వన్స్ మోర్ సీఎం అనే వార్త అభిమానుల్లో ఎంతో జోష్ నింపుతోంది. గత ఐదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన జగన్ అంతకు మించిన పరిపాలనతో మెప్పించే ఛాన్స్ అయితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: