పీపుల్స్ పల్స్ : టోటల్ రిపోర్ట్ ఇదే... ఎవరికి ఎన్నో తెలుసా..?

Pulgam Srinivas
ఆంధ్ర రాష్ట్రంలో మే 13 వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు జూన్ 4 వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఇక ఫలితాల విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ను చాలా సంస్థలు విడుదల చేశాయి. ఇకపోతే అందులో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా ఎగ్జిట్ పోల్స్ నివేదికలను తయారు చేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న పీపుల్స్ పల్స్ సంస్థ కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ ను విడుదల చేసింది.

ఆ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మే 13 వ తేదీన జరిగిన ఎన్నికలలో ఏ పార్టీ కి ఎన్ని అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అనే విషయంపై ఓ అంచనా వేసింది. అలాగే అందుకు సంబంధించిన నివేదికను కూడా విడుదల చేసింది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీ డీ పీ పార్టీ కి 95 నుండి 110 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ సంస్థ అంచనా వేసింది.

వై సీ పీ పార్టీ కి కేవలం 45 నుండి 60 సీట్లు మాత్రమే వస్తాయి అని ఈ సంస్థ అంచనా వేసింది. ఇక జనసేన పార్టీ కి 14 నుండి 20 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు , బీ జే పీ కి 2 నుండి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ సంస్థ అంచనా వేసింది. ఇకపోతే ఈ సారి ఎన్నికల్లో వై సీ పీ ఒంటరిగా పోటీలోకి దిగగా ... టిడిపి , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. దానితో ఈ సర్వే ప్రకారం కూటమి కి భారీ మొత్తంలో సీట్లు వచ్చే అవకాశం ఉంది. అదే కానీ నిజం అయితే కూటమి ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

pp

సంబంధిత వార్తలు: