పీపుల్స్ పల్స్ : ఏపీలో బీజేపీ కి కేవలం అన్నే సీట్లు..?

Pulgam Srinivas
ఎలక్షన్లకి సంబంధించి నివేదికలను తయారు చేసే సంస్థలలో పీపుల్స్ పల్స్ సంస్థ ఒకటి. ఈ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అందుకు సంబంధించిన నివేదికలను తయారు చేస్తూ ఆ రాష్ట్రంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది , ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది , ఏ ప్రాంతంలో ఎవరు గెలుపొందుతారు ఇలా అనేక రకాలుగా సర్వేలను నిర్వహించి రిపోర్టులను విడుదల చేస్తూ ఉంటారు.

ఇకపోతే వీరు నిర్వహించిన సర్వేలలో చాలా శాతం సర్వేలు వచ్చిన ఫలితాలకు చాలా దగ్గరగా ఉండడంతో జనాలు మీరు ఇచ్చే సర్వే రిపోర్టు ను చాలా నమ్ముతూ ఉంటారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తేదీన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ జూన్ 4 వ తేదీన విడుదల కానుంది. ఈ ఫలితాలు విడుదల కానున్న తేదీ దగ్గర పడడంతో తాజాగా పీపుల్స్ పల్స్ సంస్థ వారు తమ ఎగ్జిట్ పోల్స్ రిపోర్టు ను విడుదల చేశారు.

ఈ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీ జే పీ కి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే విషయాన్ని కూడా మీరు చెప్పారు. ఇక ఈ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం బీ జే పీ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 2 నుండి 4 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఇది ఇలా ఉంటే ఈ సారి బీ జే పీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో టీ డీ పీ , జనసేన తో పాటు పొత్తులో భాగంగా పోటీలోకి దిగింది. మరి పీపుల్స్ పల్స్ సంస్థ చెప్పిన విధంగానే బీ జే పీ కి 2 నుండి 4 లోపు సీట్లు మాత్రమే వస్తాయా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: