కోతులు చేసిన పనికి.. ఇద్దరు బాలురు మృతి?

praveen
దసరా పండుగకు ముందు ఆడపడుచులు అందరూ ఎంతగానో అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకునేది బతుకమ్మ పండుగనీ. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం కూడా గుర్తించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బతుకమ్మ పండక్కి అందరితో పాటుగా తాము కూడా సరదాగా గడపాలి అని అనుకున్నాయి ఆ కుటుంబాలు. కానీ అనుకోని విషాదకర ఘటన వినాల్సి వస్తుంది అని మాత్రం ఊహించలేకపోయాయ్. దసరా సెలవులు కావడంతో పిల్లలందరూ కలిసి సరదాగా ఆడుకోవడానికి వెళ్లారు అని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు.

 కానీ చివరికి కోతులు చేసిన పనికి అల్లరి ముద్దుగా పంచుకున్న పిల్లల ప్రాణాలు పోతాయని మాత్రం ఊహించలేకపోయారు.  నిజాంబాద్ జిల్లాలో కోతుల గుంపు కారణంగా పిల్లల ప్రాణాలు పోయిన ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది. కాగా నలుగురు స్నేహితుల్లో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరిని స్థానికులు కాపాడగలిగారు అని చెప్పాలి. నిజాంబాద్ జిల్లా మాట్లూరు మండలం మామిడిపల్లి గ్రామంలో 12 ఏళ్ల అఖిల్, 13 ఏళ్ల వయసు ఉన్న రాజేష్, అభిలాష్, హనుమంతులు నలుగురు కాల కృత్యాలు తీర్చుకొని స్నానం చేయడానికి చెరువుగట్టుకు వెళ్లారు.

 అక్కడే ఉన్న కోతుల గుంపు వీరిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో భయంతో ఈ నలుగురు బాలురు కూడా పరుగులు పెట్టారు. కోతుల గుంపు వెంట పడడంతో నలుగురు ఎటు వెళ్లాలని తెలియక చెరువులో పడిపోయారు. అయితే దూరం నుంచి గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని కోతులను తరిమి వేశారు... ఈ క్రమంలోనే హనుమంత్ అభిలాష్ ను కాపాడారు. అయితే మిగతా ఇద్దరు నీటిలో మునిగి చనిపోయారు. సుమారు రెండు గంటల పాటు చెరువులో గాలించి వారి మృతదేహాలను బయటకు తీశారు. ఇక పండగ పూట కొడుకుల మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన తల్లిదండ్రులు విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: