బాలీవుడ్ సినిమా చూసి ఇన్స్పైర్ అయింది.. చివరికి?
అయితే పెళ్లి చేసుకుంటాను అంటూ ఎంతో మంది యువకులను నమ్మించడం ఇక ఆ తర్వాత డబ్బులు గుంజి మోసం చేయడం చేస్తూ ఉంటుంది ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర. ఇక ఇదే విషయం ఆ యువతికి ఎంతగానో కనెక్ట్ అయి పోయింది. దీంతో ఈ సినిమా చూసి ప్రభావితమైన యువతి అచ్చం ఇలాగే మోసాలకు పాల్పడడం మొదలుపెట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని చతర్పూర్ లో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే రాజ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి మోసం లకు సంబంధించి ఫిర్యాదు నమోదయింది.
సోనాల్ లాల్ అనే వ్యక్తికి మధ్యవర్తి ద్వారా సాత్నా కు చెందిన అమ్మాయి తో వివాహం జరిగింది. బంధు మిత్రులు అందరి సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం జరిపించారు. ఇక మరుసటి రోజే వధువు తనకు ఫోన్ బంగారు ఆభరణాలు కావాలంటూ డిమాండ్ చేసింది.. అడిగింది ఇవ్వకపోతే ఇంటికి వెళ్ళిపోతాను అంటూ బెదిరింపులకు కూడా పాల్పడింది. పెళ్లి చేసుకున్న భార్య అసలు స్వరూపం తెలిసి షాకైన భర్త చివరికి ఈ విషయాన్ని తన తండ్రికి తెలిపాడు. దీంతో 5 లక్షలు అప్పు తీసుకొని మరీ వధువుకు మొబైల్ నగలు కూడా కొనుగోలు చేశారు. ఇటీవలే వధువు సోదరుడు ఇంటికి రాగా అతనితో మాట్లాడుతున్నట్లుగా నటించిన యువతి చివరికి మళ్ళీ ఇంటికి రాలేదు.దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది..