భర్తకు తెలియకుండా ఆ పని చేసిన భార్య.. చివరికి?

praveen
ఎంతో అన్యోన్యంగా సాగిపోవలసిన దాంపత్య జీవితంలో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. అక్రమ సంబంధాలతో దాంపత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలిసినప్పటికీ క్షణకాల సుఖం కోసం కట్టుకున్న వారిని మోసం చేస్తూ ఎంతోమంది మానవతా విలువలను మరిచి ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో పడి కట్టుకున్న వారిని దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇలా అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో దారుణ హత్యలు వెలుగులోకి వస్తున్న ఎక్కడ ఎవరిలో మార్పు మాత్రం కనిపించడం లేదు.

 ఇక్కడ ఇలాంటి ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది భార్య నచ్చలేదు. దీంతో భార్య ఆమె ప్రియుడి పై కోపం పెంచుకున్న భర్త చివరికి కన్నకూతురిని దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చింది. బీహార్లోని అరరియా జిల్లాలో రాజేష్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అయితే అతనికి 11 ఏళ్ల క్రితం వివాహం జరుగగా ఒక కూతురు ఉంది. అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అతడి భార్య పరాయి వ్యక్తి మోజులోపడి అక్రమ సంబంధానికి తెరలేపింది. ఎన్నో రోజుల పాటు భర్తకు తెలియకుండా ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తూ వచ్చింది సదరు మహిళ.

 చివరికి అసలు నిజం బయటపడింది.. భర్తకు భార్య అక్రమ సంబంధం గురించి తెలిసింది. దీంతో భార్యను నిలదీశాడు భర్త. పద్దతి మార్చుకోవాలి అంటూ హెచ్చరించాడు. అప్పటికి ఆ భార్య తన కాపురం గురించి ఆలోచించలేదు. ప్రియుడే ఎక్కువ అని భావించి రాసలీలలు కొనసాగిస్తూనే వచ్చింది. ఒకానొక సమయంలో ఏకంగా భర్త కూతురుని వదిలేసి ప్రియుడితో ఇంటి నుంచి పారిపోయింది. దీంతో రాజేష్ కోపంతో ఊగిపోయాడు. భార్య ప్రియుడు ని జైలుకు పంపాలి అనుకున్నాడు దీనికోసం దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను దారుణంగా హతమార్చాడు. పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: