చిక్కడు దొరకడు: గత ఐదు సంవత్సరాలు గా అమెజాన్ ని బురిడీ కొట్టించిన కేటుగాడు. ?

Surya

ఇలాంటి చెత్త ఐడియాలు ఎలావస్తాయో గాని కొంతమంది తమ చేతివాటాన్ని పలురకాలుగా చూపిస్తుంటారు. మనం చెప్పుకుంటున్న ఈ మోసగాళ్లకు మోసగాడు మాత్రం ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆన్లైన్ సంస్థ అయినటువంటి అమెజాన్ ని బలే బురిడీ కొట్టించాడు. అతడు చేసిన దోపిడీ దుల్కర్ సల్మాన్ నటించిన "కనులు కనులను దోచాయంటే" సినిమా సీన్ ని తలపించింది. వివరాలలోకి వెళితే అమెరికా కి చెందిన హడ్సన్ హామ్రిక్ అనే వినియోగ దారుడు గత ఐదు సంవత్సరాలుగా అమెజాన్ లో విలువైన వస్తువులను ఆర్డర్ చేస్తూ ఉండేవాడు. వచ్చిన ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తరువాత మళ్లీ ఏదో వంకతో ఆ ప్రోడక్ట్ ని తిరిగి పంపించే వాడు.


 అందుకు కారణం కూడా చెప్పే వాడు. ఆ ప్రోడక్ట్ తాను ఆర్డర్ చేసినది కాదని , ఆర్డర్ చేసిన కలర్ ఇదికాదు అని. ప్రోడక్ట్ నాసిరకం అని ...ఇలా వచ్చిన ప్రతి ఆర్డర్ ను తిరిగి పంపే వాడు. తాను ఏం చేస్తున్నాడో ఎవరికి తెలిసేది కాదు. ఇలా ఐదు సంవత్సరాలు ఎవరికి తెలియకుండా జాగర్త పడ్డాడు. అతడికి డెడ్ ఎండ్ రానే వచ్చింది. అతడి నుండి ప్రొడక్ట్స్ ప్రతిసారి తిరిగి వస్తూవుండడం తో అమెజాన్ అధికారులకు సందేహం వచ్చింది. వెంటనే ఈ కేసును సిబిఐ కి అప్పగించింది. సిబిఐ అసలు విషయం తెలుసుకొని ముక్కున వేలేసుకుంది. హడ్సన్ హామ్రిక్ వచ్చిన ప్రతి ఆర్డరును తీసుకోని ఒరిజినల్ ప్రోడక్ట్ ప్లేసులో డమ్మీ పార్ట్శ్ ను అమర్చేవాడు.


 తిరిగి ఆ వస్తువును పలు కారణాలు చెప్పి తిరిగి పంపేసే వాడు. ఆ ఒరిజినల్ పార్ట్శ్ ను మంచి ధరకు అమ్మేసేవాడు. ఇలా ఎవరికి దొరక్కుండా ఐదు సంవత్సరాలు అమెజాన్ కళ్ళుగప్పాడు.ఈ ప్రాడ్ పై హడ్సన్ హామ్రిక్ కు నార్త్ కరోలినాలో ని షార్లెట్ సిటి వెస్ట్రన్‌ డిస్ట్రిక్‌ నార్త్‌ కరొలినా కోర్ట్ ఈ నెల అక్టోబర్ ఐదు న విచారణ చేసింది. విచారణ అనంతరం ఈ కేటుగాడు చేసిన మోసానికి 20 ఏళ్ళు జైలు శిక్ష ఇంకా $250 000 డాలర్ల ఫైన్ విధిస్తు ప్రధాన న్యాయమూర్తి టి. స్టెట్జర్ తీర్పు ఇచ్చారు. ఎంతైనా విడి తెలివితేటలను మెచ్చుకొని తీరాల్సిందే మరి 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: