పరాఠాల కోసం ఈ కర్రీ ట్రై చేయండి.. చాలా రుచికరంగా ఉంటుంది...

Purushottham Vinay
నార్త్ ఇండియాలో ఎక్కువగా చేసుకునే వంటకం ఈ  దాల్ మఖాని..  ఈ వంటకం పరాఠాలలో తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది తింటే మనకు ఐరన్ పెరిగి చాలా బలంగా ఉంటాము.ఇది రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ వంటకం  చాలా రుచికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీనిని తినేందుకు ఇష్టపడతారు.మరి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో రుచికరమైన ఈ దాల్ మఖాని ని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం....
ముందుగా దాల్ మఖాని తయారు చెయ్యటానికి కావాల్సిన పదార్ధాలు చూడండి...
1 కప్ రాత్రంతానానబెట్టినవి నల్ల మినుములు....
1 టేబుల్ స్పూన్ రెడ్ కిడ్నీ బీన్స్....
1 కప్ క్యూబ్స్ గా కోయబడినవి ఉల్లిపాయలు....
1 కప్ గుజ్జు చేసిన టమాటో.....
1 టీ స్పూన్ పసుపు....
1 టీ స్పూన్ మిరపపొడి....
1 టీ స్పూన్ ధనియాల పొడి....
1 టీ స్పూన్ అల్లం....
1 టీ స్పూన్ వెల్లుల్లి.....
1 టీ స్పూన్ జీలకర్ర......
1 టీ స్పూన్ ఆవ నూనె.....
1 టీ స్పూన్ రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె......
అవసరాన్ని బట్టి కత్తిరించి రెండుముక్కలుగా కోసినవి....
ఆకుపచ్చని పచ్చిమిరప కాయలు....
అవసరాన్ని బట్టి ఉప్పు.....
1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీం.....
ఇప్పుడు తయారు చేసే విధానం....
ముందుగా కుక్కర్‌ తీసుకుని అందులో మినుములు, రాజ్మా వేసి కుక్కర్‌లో వేసి నీరు పోసి ఉడికించండి. ఒక్కసారి ఇవి ఉడకడం ప్రారంభం కాగానే ఉప్పు, పసుపు, ఆవాల నూనె వేయండి. దీనిని మూత పెట్టి 7, 8 విజిల్స్ వచ్చే వరకూ సన్నని మంటపై ఉడికించండి.ఇప్పుడు మరో పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయండి. అందులో వెల్లుల్లి, అల్లం తురుము వేసి 20 నుంచి 30 సెకన్ల పాటు వేయించండి. వీటితో పాటు ఉల్లిపాయలు వేసి దోరగా వేయించండి. ఇప్పుడు అందులోనే జీలకర్ర వేసి మరికాసేపు వేయించండి.

తర్వాత అందులో టమాటా ప్యూరీ వేసి 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించండి. అనంతరం, పచ్చిమిరపకాయ ముక్కలు, కారంపొడి, ధనియాల పొడి,వేసి రెండు నిమిషాల పాటు వేయించండి. ఇలా తయారైన పోపుని తీసి పక్కన పెట్టుకోండి.ఇప్పుడు కుక్కర్ 8 నుంచి 10 విజిల్స్ వచ్చాక మూత తీయండి.. అనంతరం దాల్ మసాలాని అందులో వేయండి.. ఇప్పుడు అందులో వెన్నని వేయండి. ఇలా వేయడం వల్ల మంచి రుచి వస్తుంది.ఇలా తయారైన టేస్టీ దాల్ మఖానిని వేడివేడిగా సర్వ్ చేయండి. పై నుంచి ఫ్రెష్ క్రీమ్‌తో గార్నిష్ చేయండి. ఇది చపాతీ, రోటీ, పరాఠాల్లోకి చాలా బావుంటుంది.ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: