"ఓటిటి" పై పడిపోతున్న యంగ్ హీరోలు..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యే కంటెంట్ లో నటించడానికి మీడియం రేంజ్ హీరోలు కూడా పెద్దగా ఆసక్తిని చూపించే వారు కాదు. కానీ కాలం మారింది. ఇప్పుడు జనాలు డిజిటల్ కంటెంట్ కు చాలా అలవాటు పడిపోయారు. ప్రతి శుక్రవారం వస్తే సినిమా ధియేటర్ల వైపు చూసేవారు ప్రస్తుతం ఓ టి టి కంటెంట్ వైపు చూస్తున్నారు. అలా ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులు డిజిటల్ కంటెంట్ కు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ ఉండటంతో మంచి క్రేజ్ ఉన్న నటీనటులు కూడా ప్రస్తుతం ఓ టీ టీ ప్లాట్ ఫామ్ స్ట్రీమింగ్ అయ్యే కంటెంట్ లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు.

అందులో భాగంగా ఇప్పటికే అనేక మంది మంచి గుర్తింపు కలిగిన తెలుగు హీరోలు కూడా వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. కొంత కాలం క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న నాగ చైతన్య , విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన దూత అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ వెబ్ సిరీస్ కి ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా నాగ చైతన్య కు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు కూడా లభించింది. అలాగే వెంకటేష్ రానా కూడా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఇక మరో తెలుగు క్రేజీ హీరో కూడా ఓ టి టి వైపు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని మరికొన్ని రోజుల్లో నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోయే ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయినట్లు మరికొన్ని రోజుల్లోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇలా మన క్రేజీ యువ హీరోలు అంతా కూడా ఓ టీ టీ పై పడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: