జగమంత జగన్ : సీమలో టీడీపీ దుకాణం బంద్.. వైసీపీ గెలిచే స్థానాలు ఇవే!

Reddy P Rajasekhar

వైసీపీకి రాయలసీమ జిల్లాలు కంచుకోటలు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాయలసీమ జిల్లాలలో వైసీపీ ప్రభంజనం కొనసాగనుందని ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో 49 నియోజకవర్గాల్లో వైసీపీ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో మాత్రం 45 స్థానాలలో విజయం సాధించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.
 
నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, డోన్ లో వైసీపీ విజయం సాధించనుంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలో పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరులలో వైసీపీ విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అనంతపూర్ పార్లమెంట్ పరిధిలో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, అనంతపూర్ అర్బన్, కళ్యాణదుర్గం వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి.
 
రాప్తాడు, మడకశిర, పుట్టపర్తి, కదిరి, ధర్మవరంలలో వైసీపీ సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడప పార్లమెంట్ పరిధిలో బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరులలో వైసీపీ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటిలలో వైసీపీ సత్తా చాటనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగరి, కుప్పం మినహా మిగతా అన్ని స్థానాల్లో వైసీపీ సత్తా చాటనుంది.
 
కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ మధ్య టఫ్ ఫైట్ ఉందని ఆ స్థానాలలో సైతం వైసీపీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని సమాచారం అందుతోంది. మహిళలు, పేదలు, వృద్ధుల కోసం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించబోతున్నాయని ఇందులో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని తెలుస్తోంది. గ్రామీణ ఓటర్లు, మహిళలు మరోసారి రాష్ట్రంలో వైసీపీకి పట్టం కట్టబోతున్నారని సమాచారం అందుతోంది.  వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆ పార్టీకి శ్రీరామరక్ష అని తెలుస్తోంది. జగన్ పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: