జగమంత జగన్: మరోసారి ఫ్యాన్ ప్రభంజనం..!

Divya
సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వంపై సానుకూలత పాజిటివ్ తో ఓటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది.. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద నిన్నటి రోజున ఉదయం 6 గంటల నుంచి ఓటర్లు సైతం బార్లు తీరారు.. ముఖ్యంగా వృద్ధులు ,మహిళలు ,బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు కూడా భారీ ఎత్తున ఓటు వినియోగించుకోవడానికి కదిలి వచ్చారు.. సాయంత్రం ఐదు గంటల సమయానికి 68.04 వరకు పోలింగ్ నమోదయింది 6 గంటలకు సమయంలో కూడా పోలింగ్ వద్ద చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు.

అలా క్యూలో నిలబడిన వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పించింది. కొన్ని ప్రాంతాలలో రాత్రి 10 గంటల వరకు పోలింగ్ కూడా కొనసాగింది. దీంతో పోలింగ్ 80 శాతానికి చేరుకొనే అవకాశం ఉన్నదట. నగర పట్టణ ప్రాంతాలలో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలలో అత్యధికంగా పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. పోలింగ్ సరళి పైన ఇండియా టుడే ఛానల్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశామ్ నిన్నటి రోజున రాత్రి టీవీలో ఒక చర్చను సైతం జరిపారు.

ఆంధ్రప్రదేశ్లో తాను విస్తరింగా పర్యటించానని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు ఓటర్లు సైతం ఎన్నికల ఫలితాలను నిర్దేశించారని తెలియజేశారు. ఏ రాష్ట్రంలో నైనా మహిళలు గ్రామీణ ప్రాంత ఓటర్ల ఎక్కువగా నిర్ణయిస్తారని..ముఖ్యంగా రోడ్ల గురించి కాకుండా ప్రభుత్వ సేవలు ఎలా ఉన్నాయని విషయంగానే గ్రామానికంగా తీసుకొని 80 శాతం మంది ఓటర్లు వేస్తున్నారని తెలిపారు.. నవరత్నాల పథకాలను గ్రామ వార్డు సచివాలయాలు వాలంటరీ వ్యవస్థ ఇలా ప్రభుత్వం బాగా అందించిందనీ.. సంక్షేమ అభివృద్ధి పథకాలు విద్యా వైద్యం వ్యవసాయ ఇతరత్రా రంగాలలో పలు రకాల మార్పులను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలకు ఎన్నో పథకాల వైపుగా అడుగులు వేశారు. మరింత అభివృద్ధి కోసం ఓటర్లు ఆకాంక్షిస్తూ  ఓట్లు వేసేందుకు స్వచ్ఛందంగా వచ్చారని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే ఖచ్చితంగా ఈసారి ఫ్యాన్ ప్రభంజనం మరొకసారి కనిపించేలా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: