పిచ్చి పీక్స్.. తాత కోసం నాలుక కోసుకున్నాడు?

praveen
దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది. ఏది కావాలన్నా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో దొరుకుతుంది. దీంతో మనిషి గడప దాటి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. ఇంట్లోనే పని చేయడం.. ఇక ఇంట్లోనే డబ్బులు సంపాదించడం కూడా నేటి రోజుల్లో కనిపిస్తుంది. ఇలా టెక్నాలజీ పెరిగిపోవడం మనిషి జీవితాన్ని ఎంతో సులభతరం చేసింది అని చెప్పాలి. అంతేకాదు ఇక ఏదైనా రోగ్య సమస్యలు వచ్చిన అత్యాధునిక వైద్య సదుపాయాలు కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇలాంటి ఆధునిక సమాజంలో కూడా నేటికీ కొంతమంది మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోయి పిచ్చి పనులు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ ఉన్నారు.

 ఈ క్రమంలోనే మొక్కులు చెల్లించుకుంటున్నాం అనే పేరుతో కొంతమంది వ్యక్తులు చేసే పిచ్చి పనులు కాస్త ప్రతి ఒక్కరిని ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. సాధారణంగా ఆరోగ్యం బాగా లేనప్పుడు దేవుడిని మొక్కడం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆరోగ్యం నయం అయితే తలనీలాలు సమర్పిస్తాను అంటూ మొక్కుకోవడం చూసాము. కానీ ఇక్కడ మాత్రం ఓ యువకుడు అలా చేయలేదు. ఏకంగా తలనీలాలు డబ్బు బంగారం లాంటి కానుకలను సమర్పించడం కాదు ఏకంగా తన నాలుకను దేవుడికి సమర్పించాడు..

 ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. వీరేష్ అనే యువకుడు దేవుడికి నాలుకను సమర్పించాడు. ఏకంగా నాలుకను కోసి ఇచ్చేసాడు. కొన్ని రోజుల నుంచి వీరేష్ తాత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. తాత అంటే వీరేష్ కి ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే తాత త్వరగా కోలుకోవాలని ఆలయంలో పూజలు చేశాడు. ఈ క్రమంలోనే కానుకలు సమర్పించడానికి బదులు కత్తితో తన నాలుక కోసి సమర్పించాడు. గ్రామస్తులు గమనించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అతని మానసిక స్థితి సరిగ్గా లేదని అటు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mad

సంబంధిత వార్తలు: