కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగ లాంటి వార్త?

Purushottham Vinay
ఇక భారత దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ నెల అనేది నిజంగా ఓ పెద్ద పండగే అని చెప్పొచ్చు.ఎందుకంటే ఒకే నెలలో ఉద్యోగులకు కేంద్రం మూడు కానుకలు అందించే అవకాశం ఉంది. డీఏ పెంపు ఇంకా డీఏ బకాయిల చెల్లింపుతో పాటు పీఎఫ్ వడ్డీని ఖాతాల్లో జమ చేసే అవకాశం అనేది ఉంది. సెప్టెంబర్ నెల మొదటి వారంలో డీఏ పెంపుపై ప్రకటన ఆ తర్వాత డీఏ బకాయిల చెల్లింపు ఇంకా పీఎఫ్ వడ్డీ జమ ఉంటుందని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం...ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 34 శాతం డీఏ అనేది అందుతోంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా రెండు డీఏలు అనేవి ఉంటాయి. ఈ ఏడాది మార్చి నెలలో కేంద్రం మొదటి డీఏను ప్రకటించింది.జనవరి నెల నుంచే ఇది అమలులోకి వచ్చింది. ఇక రెండో డీఏ ఎప్పుడనేది కేంద్రం ఇప్పటికైతే ఇంకా ప్రకటించలేదు.ఆగస్టు నెల కూడా ముగుస్తుండటంతో సెప్టెంబర్‌ నెల మొదటివారంలో రెండో డీఏ పెంపు ఉండొచ్చునని ఉద్యోగులు భావిస్తున్నారు.


ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) జూన్‌ నెలలో మొత్తం 129.2 పాయింట్లుగా ఉంది. ఈ లెక్కన 4 శాతం డీఏ పెంపుకు 7వ వేతన సంఘం సిఫారసు చేసే అవకాశం కూడా ఉంది.ఇంకా అలాగే కరోనా కాలంలో 18 నెలల పెండింగ్ డీఏ బకాయిలను కేంద్రం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. ఇక ఈ కోవిడ్-19 మహమ్మారి కారణంగా మే 2020 నుంచి జూన్, 2021 వరకు కూడా కేంద్రం డీఏని నిలిపివేసింది.సెప్టెంబర్‌లోనే ఈ ఏరియర్స్ ఉద్యోగుల ఖాతాలో జమయ్యే అవకాశం అనేది ఉంది. అదే జరిగితే ఉద్యోగులకు ఒకేసారి భారీ మొత్తంలో ఈ డబ్బు అందుతుంది.ఇంకా అలాగే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌పై 2021-22 వడ్డీ రేటును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 8.10గా నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర్‌ నెలలో ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. ఒకే నెలలో డీఏ పెరగనుండటం, డీఏ బకాయిలు ఇంకా అలాగే పీఎఫ్ వడ్డీ కూడా జమయ్యే అవకాశం ఉండటంతో ఉద్యోగులకు సెప్టెంబర్ నెల అనేది చాలా పెద్ద పండగే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: