ఎక్కువ జీతం పొందే వారు టాక్స్ 66 శాతం తగ్గించుకోవాలంటే ఎలా?

Purushottham Vinay
విశాఖకు చెందిన ప్రియాంక అనే ఆమెకు కంపెనీలో జీతం పెంపు వచ్చింది. ఇక ఈ పెంపు వల్ల ఆమె ఆదాయం టాక్స్(Tax View) పరిధిలోకి వచ్చింది. శాలరీ స్ట్రక్చర్(Salary Structuring) టాక్స్ ఫెండ్లీగా వున్నా కాని ఆమె ఆదాయ పన్ను కింద వచ్చే మినహాయింపులను మాత్రం పొందలేకపోతోంది. ఇక ఆమె ఆర్థిక సలహాదారును కలవగా..ఆయన సూచన మేరకు ఇంటి అద్దె ఎక్కువగా చెల్లించటం వల్ల ఆమె లక్ష రూపాయల వరకు పన్ను మినహాయింపును పొందడం అనేది జరిగింది. ఇక దీనికి తోడు ఆమె శాలరీ స్ట్రక్చర్ లో చేసిన కొన్ని మార్పుల వల్ల నేష్నల్ పెన్షన్ స్కీమ్ లో సొమ్మును పెట్టుబడిగా పెట్టడం జరిగింది. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ప్రియాంక గతంలో నెలకు రూ.15 వేలు ఇంటి రెంట్ చెల్లించేంది. ఇంతకు ముందు ఆమెకు అంతే హెచ్ఆర్ ఏ అనేది వచ్చేది. కానీ తాజాగా పెరిగిన జీతం వల్ల రూ. 25 వేలు హెచ్ఆర్ ఏ అనేది ఆమెకు లభిస్తోంది. ఇక దీనిని టాక్స్ ఫ్రీ గా మార్చాలంటే ఆమె రూ.31 వేలు రెంట్ అనేది చెల్లిస్తూ ఉండాలి.


ఇలా చేయటం వల్ల ఆమె చెల్లించాల్సిన టాక్స్ అనేది సుమారు రూ. 42 వేల దాకా తగ్గుతుంది.అలాగే దీనికి తోడు ఆమె తన కంపెనీని ఎన్పీఎస్ సౌలభ్యాన్ని అందిచమని కోరాలి. అందువల్ల ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్-80CCD(2) కింద ఆమె పొందుతున్న బేసిక్ శాలరీలో 10 శాతం దాకా పన్ను రహింతగా మారుతుంది. ఒకవేళ ఆమె జీతంలో 10 శాతం అనేది అంటే రూ. 6250 ని ప్రతి నెలా ఎన్పీఎస్ కనుక చెల్లిస్తే.. దాని వల్ల చెల్లించాల్సిన టాక్స్ లో రూ. 23,400 వరకు తగ్గింపు అనేది లభిస్తుంది. అలాగే దీనికి తోడు ఆమె మరో రూ. 50 వేల స్వంతంగా ఎన్పీఎస్ లో కనుక జమచేస్తే మరో రూ. 15,600 టాక్స్ రిడక్షన్ అనేది పొందవచ్చు. దీనికి అదనంగా ఆమె కంపెనీ ద్వారా గాడ్జెట్స్ ఇంకా అలాగే మెడికల్ గ్రూప్ కవరేజ్ పొదటం వల్ల మరో రూ. 19,500 వరకు పన్ను అనేది తగ్గించుకోవచ్చు. ఇలా చెల్లించాల్సిన టాక్స్ మెుత్తం కూడా రూ.1,52,942 నుంచి రూ. 52,562కు తగ్గుతుంది. ఇలా ఉద్యోగులు చెల్లించాల్సిన టాక్స్ మెుత్తాన్ని కూడా సరైన ఆర్థిక సలహాదారును సంప్రదించటం ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: