లూసిఫర్-2 నుంచి అదిరిపోయే అప్డేట్.. నెక్స్ట్ లెవెల్ లో మోహన్ లాల్..!

Divya
మలయాళం లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన హీరో మోహన్లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి భాషలలో నైనా ఏలాంటి పాత్రలోనైనా సరే నటించగలిగిన సత్తా కలిగిన హీరోగా పేరు సంపాదించారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో మోహన్లాల్ హీరోగా నటించిన లూసీ ఫర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం 2019లో కేరళలోని ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది. ఇందులో టామినోతామస్, వివేక్ ఒబెరామ్, మంజు వారియర్ తదితరులు కీలకమైన పాత్రలు నటించారు.

ఆ తర్వాత లూసీ ఫర్ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.ఎప్పటినుంచో ఈ సీక్వెల్ పైన పలు రకాల వార్తలు కూడా వినిపించాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం పూజ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు అధికారికంగా లూసిఫర్-2 నీ  ప్రకటించారు. లూసిఫర్-2 ఏంపురాన్ అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ రోజున మోహన్లాల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ నుంచి ఒక పోస్టర్ని సైతం విడుదల చేశారు.

అయితే ఈ పోస్టర్లో మోహన్ లాల్ చుట్టూ బాడీగార్డ్స్ ఉండగా అతను నడుచుకుంటూ వస్తున్నట్లుగా చూపించారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.అయితే లూసీ ఫర్-2 ఎప్పుడు విడుదల అవుతుందా అనే విషయం పైన చిత్ర బృందం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.. లూసిఫర్ చివరిలో మోహన్లాల్ విదేశాలలో ఒక మాఫియా డాన్ గా చూపించడం అయితే జరిగింది.. తన తమ్ముడైన టామినో థామస్ ను సీఎంగా చేయడాన్ని చూపిస్తారు.. దీంతో మొదటి భాగం ముగిస్తుంది. ఆ తర్వాత లూసిఫర్ ఎవరు తండ్రి లాంటి వ్యక్తి నుంచి దూరమైన ఒక యువకుడు లూసిఫర్ గా ఎలా మారారు అనే విషయాన్ని చూపించబోతున్నారు.. అలాగే మాఫియాను గడగడలాడించిన అబ్రహం ఖుషేర్ ను చూశారా అనే విధంగా ఈ పోస్టర్ని సైతం రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి లూసీఫర్లో కంటే సీక్వెల్లో మరింత హైలెట్ గా కనిపించబోతున్నారు మోహన్లాల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: