ఆరోపణలు ఫ్రంట్‌ పేజీల్లో.. వాస్తవాలు ఎక్కడో ఓ మూల చిన్నగా సింగిల్‌ కాలమ్‌లో..?

Chakravarthi Kalyan
ఇంకేముంది జగన్‌ సర్కారు దిగిపోయే ముందు తన మిత్రులైన కాంట్రాక్టర్ల బిల్లులన్నీ చెల్లిస్తోంది. సంక్షేమ పథకాలకు మాత్రం నిధులు ఆపుతోందని ఎల్లో మీడియా ఇటీవల ఎన్నో కథనాలు రాసింది. జగన్ ఓడిపోతున్నారని తెలిసి ఈ సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని ఫ్రంట్ పేజీలో కథనాలు వండి వార్చారు.
కానీ ఇప్పుడు చూస్తే ప్రభుత్వం విడతల వారీగా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసేస్తోంది.  మరి ఈ వార్తలు మాత్రం తమ పేపర్‌లో లోపల చిన్న ఒక కాలమ్ లో వార్తలు ప్రచురిస్తోంది ఎల్లో మీడియా. అబద్ధాన్ని అద్భుతంగా ఫ్రంట్ పేజీలో ప్రచురించిన ఆయా పత్రికలు నిజాన్ని మాత్రం లోపల పేజీల్లో వేస్తూ సీఎం జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారు. డీబీటీ పథకాలకు సంబంధించి ఆసరా పథకం, జగనన్న విద్యా దీవెన, జగనన్న చేయూత, ఈబీసీ నేస్తం వంటి పథకాలకు సంబంధించిన నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది. మరి ఇప్పుడు ఏం అంటారు అని వైసీపీ శ్రేణులు టీడీపీని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: