తిరుపతి ఘటనపై వైసీపీ మహిళా నేత సంచలన వ్యాఖ్యలు..!
రోజా మాట్లాడుతూ చంద్రబాబు అసమర్ధత వల్లే ఈ ఘటనలు జరిగాయని విమర్శించారు.. ఈ ఘటనకు కారణం ఎవరు కనుక్కోకుండా కొన్ని నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారు అంటూ ఫైర్ కావడం జరిగింది..టీటీడీ బోర్డుని ఎవరు ప్రశ్నించారా? భక్తులకు సర్వీస్ చేయాలని ఉద్దేశం ఎవరికీ లేదా అంటూ ఫైర్ అయ్యింది. కేవలం అధికారులందరూ కూడా చంద్రబాబు దగ్గర భజన చేస్తూ తిరుగుతున్నారని తిరుపతికి వచ్చే భక్తులను గాలికి వదిలేస్తూ ఉన్నారంటూ విమర్శించింది. వైసిపి హయాంలో మాత్రం ఇలాంటివి అసలు జరగలేదని తెలియజేసింది.
భక్తులు తిరుపతికి వెళుతూ ఉన్నప్పటికీ అక్కడ కనీస సదుపాయాలు కూడా లేవని ఇదంతా కూడా నిర్లక్ష్యం కాదా అంటూ ప్రశ్నించింది. అలాగే తెలంగాణలో ఒక సంఘటనలు మహిళా చనిపోతే అల్లు అర్జున్ పైన కేసు పెట్టారు మరి ఈ ఘటనలో చంద్రబాబు నుంచి కింద స్థాయి అధికారులకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిన.. ఒక ఘటనలాగా కేసులు నమోదు చేశారు అంటూ ఫైర్ అయ్యింది. హిందువులను కాపాడాలని ఎవరెవరో చెప్పారు ఇప్పుడు ఆ పీఠాధిపతులు ఏమయ్యారు తిరుపతి లడ్డు పైన బీజేపీ టిడిపి నేతలు ఎన్ని మాట్లాడారు అందరూ చూశారు.. మరి ఇప్పుడు ఆ నోరు ఏమయ్యింది అంటూ రోజా ఫైర్ అయ్యింది. ప్రధాన మోడీకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము బాధ్యతలను కచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ తెలియజేసింది.
అలాగే ఆ నూతన యోధుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనకు ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటారో అంటూ ఫైర్ అయ్యింది. కూటమి నేతలు కేవలం ఇతరులను తిట్టడానికే తప్ప లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారు హోంమంత్రి అంటూ ప్రశ్నిస్తోంది రోజా. కేవలం చంద్రబాబు వైఫల్యం అసమర్థత వల్లే ఇంత మంది మరణించారంటూ తెలిపింది వైసిపి మహిళా నేత రోజా.