డాకు మహారాజ్ : తమిళ్.. హిందీ భాషల్లో ఆరోజు విడుదల..?

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ లో ఊర్వసి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ ఓ కీలకమైన పాత్రలలో కనిపించనుండగా ... ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ్ , హిందీ భాషల్లో కూడా విడుదల చేసే సన్నాహాలు మేకర్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని జనవరి 12 వ తేదీన తెలుగు లో విడుదల చేయనుండగా జనవరి 17 వ తేదీన ఈ సినిమాను తమిళ్ మరియు హిందీ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.

అఖండ , వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి లాంటి మూడు వరుస విజయాల తర్వాత బాలయ్య హీరో గా రూపొందిన సినిమా కావడం , వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: