నందమూరి కుటుంబం లో ఉన్న స్టార్ హీరో లలో బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరికి అద్భుతమైన పాన్ ఫాలోయింగ్ ఉంది . వీరు నటించిన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ప్రేక్షకుల్లో అద్భుతమైన ఉత్సాహం నెలకొంటూ ఉంటుంది. అలాగే వీరి సినిమాలకు హిట్టు , ఫ్లాపు టాక్ తో సంబంధం లేకుండా అద్భుతమైన కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ పోయిన సంవత్సరం దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.
ఇకపోతే బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే దేవర పార్ట్ 1 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకుగానూ నటించాడు. ఇకపోతే డాకు మహారాజ్ సినిమాలో కూడా బాలకృష్ణ రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో తండ్రి గాను , మరొక పాత్రలో కొడుకు గానూ ఈయన కూడా ఈ సినిమాలో నటించినట్లు తెలుస్తుంది.
ఇకపోతే దేవర సినిమాలో ఫస్ట్ ఆఫ్ లో తండ్రి ఎపిసోడ్ వచ్చి సెకండ్ హాఫ్ లో కొడుకు ఎపిసోడ్స్ వస్తాయి. ఇక డాకు మహారాజ్ సినిమాలో మాత్రం ఫస్ట్ ఆఫ్ లో కొడుకు ఎపిసోడ్లు వచ్చి , సెకండ్ హాఫ్ లో తండ్రి ఎపిసోడ్లు వస్తాయి అని తెలుస్తుంది. అలా దేవర , డాకు మహారాజ్ సినిమాల కథ కాస్త దగ్గరగా ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం అత్యంత భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. డాకు మహారాజ్ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.