సైలెంట్ టాక్ : ఓడేది కారు.. వీరిగేది చెయ్యి.. వికసించేది కమలం?

praveen
మే 13వ తేదీన తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను పోలింగ్ ముగిసింది. ఈ క్రమంలోనే ప్రచారంతో హోరెత్తించిన అభ్యర్థుల భవితవ్యం ఏంటి అన్న విషయాన్ని తమ ఓటుతో తేల్చేశారు ప్రజలు. ఈ క్రమంలోనే ఎవరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి తెలంగాణ అంతటా కూడా చర్చ జరుగుతుంది.

 అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో మెజారిటీ తమకే వస్తుందంటూ అన్ని పార్టీలు కూడా ధీమాతో ఉన్నాయి. మరి ఫలితాలలో ఎలాంటి మ్యాజిక్ జరగబోతుంది అనే విషయంపై విశ్లేషకులు కూడా తెగ రివ్యూ ఇస్తున్నారు. అదే సమయంలో కొన్ని సర్వే రిపోర్ట్ లు కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న సైలెంట్ టాక్ ప్రకారం.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సాధించేది అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ కాదు.. కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారాన్ని దక్కించుకున్న బిజెపి అన్నది తెలుస్తుంది.

 అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ పార్టీలకు పట్టం కట్టడానికి ఇష్టపడిన తెలంగాణ ప్రజలు అటు పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే మాత్రం దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేశారట. ఇక మోదీ ప్రధానమంత్రిగా చేసిన పనులను.. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ముందుండినడిపించిన తీరు తెలంగాణ ప్రజలను లోకల్ పార్టీల నుండి జాతీయ పార్టీ వైపు మళ్లేలా చేసిందట. ఇంకోవైపు ఇక ఓడిపోతుంది అనుకున్న స్థానాలలో బిఆర్ఎస్ నుంచి కూడా బిజెపికి పూర్తిస్థాయి మద్దతు అందిందట.. ఇలా బిఆర్ఎస్ ఓట్లు కూడా కూడగట్టుకుని బిజెపి మెజారిటీతో గెలవబోతోంది అనే ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా కొన్నిచోట్ల బలమైన అభ్యర్థులను నిలబెట్టకపోవడం కూడా బీజేపీకి కలిసి రాబోతుందట. ఇలా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్  డిజిట్ కే పరిమితమైతే బిజెపి మాత్రం డబుల్ డిజిట్ మెజారిటీ సాధిస్తుందని తెలంగాణ రాజకీయాలలో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: