బ్యాంకర్స్‌కు శుభవార్త.. ఏమిటంటే?

Suma Kallamadi
రోజురోజుకూ వస్తువుల ధరలు, లివింగ్ కాస్ట్ పెరిగిపోతుండటం మనం గమనించొచ్చు. ఈ క్రమంలోనే ఆదాయం కూడా పెరగాల్సిన అవసరముంది. కాగా, ప్రభుత్వ ఉద్యోగుకు అయితే రిపోర్ట్స్ ఆధారంగా వేతనాలు పెరుగుతూ ఉంటాయి. కొవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్, ఆ తర్వాతి పరిస్థితుల కారణంగా ప్రభుత్వం పలు నిర్ణయాలను పెండింగ్‌లో ఉంచింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోసం డియర్ నెస్ అలవెన్స్ పెండింగ్‌లో ఉంచింది. తాజాగా దానిని రిస్టోర్ చేసింది. ఈ నేపథ్యంలోనే బ్యాంకు ఉద్యోగులకు కూడా వేతనాలు పెరగనున్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పెన్షన్ పెరగనుంది. దీని ద్వారా లక్షలాది మంది బ్యాంకు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ప్రయోజనం రాబోతుంది. మొత్తంగా ఈ నెలలోనే వేతనాల పెంపు అమల్లోకి రానుంది.
గత త్రైమాసికానికి బ్యాంకు ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ 2.1 శాతం పెరిగింది. ఫలితంగా డీఏ పర్సెంటేజ్ 27.79 శాతానికి చేరుకుంది. 11వ బీపీఎస్ సాలరీ స్ట్రక్చర్ ప్రకారం పెరిగిన డీఏ ఆగస్ట్ నుంచి అక్టోబర్ నెలలకు వర్తిస్తుంది. అంతే కాకుండా 11వ బీపీఎస్ సాలరీ స్ట్రక్చర్‌లో బ్యాంకు ఉద్యోగులకు 3 శాతం డీఏ పెరగగా, ఇప్పుడు పెరిగిన 2.1 శాతం డీఏ ఆగస్ట్ నుంచి మూడు నెలలకు వర్తిస్తుంది అని అదికారులు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా 8 లక్షల బ్యాంకు ఉద్యోగులకు లాభం కానుంది. ఈ క్రమంలో బ్యాంకు ఉద్యోగులకు డీఏ పెరుగుతుంది కాబట్టి వేతనం కూడా పెరుగుతుంది. అది ఆటోమేటికల్‌గా జరిగిపోతుంటుంది. డీఏ బేసిక్ వేతనానికి లింక్ అయి ఉంటుంది కనుక బ్యాంకు ఉద్యోగుల చేతికి వచ్చే శాలరీ కూడా పెరుగుతుంది.
ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, బ్యాంకు ఉద్యోగులకు డీఏ పెరుగుతుంటుంది. డీఏ పెరిగినప్పుడల్లా వేతనం పెరుగుతూ ఉంటుంది. ఆల్ ఇండియా కంజూమర్ ప్రైస్ ఇండెక్స్‌ని పరిగణనలోకి తీసుకొని డీఏని లెక్కిస్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ డేటాను రిలీజ్ చేసింది. కాగా, ఈ డేటా వచ్చిన అనతరం కొద్ది రోజులకే డీఏ పెరుగుతుంది అని అదికారులు తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ కూడా పెరగనుంది. చివరి వేతనంలో 30 శాతం పెన్షన్ లభిస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ శ్లాబ్ పెంచింది. దీనితో మొత్తంగా పెన్షన్ పొందుతున్న కుటుంబాలకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ప్రయోజనం వస్తుంది అన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: