భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మర్కెట్స్...!

Kothuru Ram Kumar
గత నాలుగు రోజుల నుంచి నష్టాల్లో నడుస్తున్న దేశి స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు నేడు లాభాల్లో ముగిశాయి. నేడు బెంచ్ మార్క్ సూచీలన్నీ పరుగులు పెట్టాయి. హెవీ మెటల్ షేర్లు, బ్యాంక్ రంగం సంబంధించి షేర్లు లాభాల బాట పట్టడంతో నేడు షేర్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. ఇక నేడు సెన్సెక్స్ మార్కెట్ సమయం ముగిసే సరికి ఏకంగా 748 పాయింట్లు లాభపడి 37,688 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 240 పాయింట్లు లాభపడి 11,095 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇక నేడు నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్ లు మిశ్రమంగా ముగిశాయి. ఒక్క నిఫ్టీ ఐటీ ఇండెక్స్ తప్ప... మిగతా ఇండెక్స్ లు అన్ని లాభాల్లో ముగిశాయి. ఇక నిఫ్టీ 50 లో జి ఎంటర్టైన్మెంట్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, మారుతి సుజుకి, జెఎస్డబ్ల్యు స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీల షేర్లు అత్యధికంగా లాభపడిన లిస్టులో ముందుగా ఉన్నాయి. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన షేర్లు ఏకంగా 7.4 శాతం లాభపడింది. ఇక మరోవైపు హెచ్ సిఎల్ టెక్, బీపీసీల్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ఇందులో అత్యధికంగా టెక్ మహేంద్ర రెండు శాతం పైగా నష్టపోయింది.

ఇక మరోవైపు అంతర్జాతీయంగా రూపాయి మారక విలువ డాలర్ తో పోలిస్తే, ఎటువంటి లాభ నష్టాలు లేకుండా ట్రేడ్ కొనసాగుతోంది. ప్రస్తుతం 75.04 వద్ద రూపాయి విలువ కదలాడుతుంది. ఇక అలాగే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కాస్త తగ్గాయి. ముఖ్యంగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్  కు 1.4 శాతం తగ్గి 43.52 డాలర్లకు చేరుకుంది. అలాగే డబ్ల్యూటీఐ ముడి చమురు ధర బ్యారెల్ కు 1.4 శాతం నష్టపోయి 40.4 డాలర్లకు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: