తిరుపతి: చంద్రగిరిలో హై టెన్షన్.. రంగంలోకి జవాన్లు..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఈరోజు ఎన్నికల సైతం జరుగుతున్నాయి.. ఈసీ ఎంత పగడ్బందీగా  ఎలక్షన్ ని జరపాలని చూసినప్పటికీ ఎక్కడో ఒకచోట గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో వైసిపి టిడిపి మధ్య హోరాహోరీగా యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టిడిపి వైసిపి ఏజెంట్ల మధ్య ఒక ఘర్షణ కూడా జరుగుతోంది. రెండు వర్గాలను కూడా సముదాయించిన పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో బిఎస్ఎఫ్ జవాన్లు కూడా గాలిలోకి బుల్లెట్లు కాల్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడి రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.

విషయం తెలుసుకున్న వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డీ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఉండే గ్రామస్తులు ఎవరు కూడా ఆ ధైర్య పడవద్దు అంటు తను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు.. దీంతో అక్కడి గ్రామస్తులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.. మోహిత్ రెడ్డి వెళ్లిపోయిన తర్వాత టిడిపి అభ్యర్థి పులివర్తి నాని గ్రామాలలోకి వచ్చి గ్రామంలో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని పోలింగ్ సామాగ్రిని కూడా ధ్వంసం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.. పోలీసుల బలగాలు భారీగా మోహరించడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..
మరొకవైపు ఏపీలో మూడు ఏజెన్సీ నియోజకవర్గాలలో కూడా పోలింగ్ ఇటీవల ముగిసింది ఉదయం 7 గంటలకు మొదలైన ఈ పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకే ముగిస్తోంది.మోవోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం ఆరు నాలుగు గంటలకే ఈ పోలింగ్ గడువు ముగియనుంది. ఇప్పటి వరకు క్యూలో   ఉన్న వారందరికీ ఓటు వినియోగం చేసుకునేలా అవకాశం కల్పిస్తామంటూ అక్కడి అధికారులు కూడా తెలియజేస్తున్నారు.. మరి చంద్రగిరిలో ఒక్కసారిగా హై టెన్షన్ నెలకొనడంతో అక్కడి ఓటర్లు కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది.దీంతో బలగాలు సైతం మూకుమ్మడిగా అడ్డుకట్టు వేస్తున్నారు.. మరి అధికారం ఏ పార్టీ చేపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: