బీజేపీ శివలింగం దిగిన పాము.. భలే పోల్చిన జగ్గారెడ్డి?

Chakravarthi Kalyan
బీజేపీ నేతలు శివలింగం మీద పాములాంటి వాళ్లని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అంటున్నారు. శివలింగం మీద పాములాంటి వాళ్లు కాబట్టే ప్రజలు మొక్కుతున్నారని.. శివలింగం దిగిన పాముకు పట్టిన గతే బీజేపీ నేతలకు పడుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లక్ష్మణ్ కు పొలిటికల్ చిప్‌ ఖరాబు అయిందని తక్షణమే రిపేర్ చేసుకుని మాట్లాడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు.

రాష్ట్రంలో ఐదేళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ పార్టీని విలీనం చేస్తారనేది అవివేకమని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వానికి 65మంది ఎమ్మెల్యేలున్నారని భారాస నుంచి మనసు మార్చుకుని 20మంది...భాజపా నుంచి ఐదుగురు వస్తే మేము సేఫ్‌నే కదా అని లక్ష్మణ్‌నుద్దేశించి జగ్గారెడ్డి అన్నారు. మోసగాళ్లకు మోసగాళ్లు భాజపా నేతలని జగ్గారెడ్డి ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: