రాయలసీమ: ఉమ్మడి జిల్లాలో సత్తా చాటిన మహిళ ఎమ్మెల్యేలు..!

Divya
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలలో రాయలసీమ లోని అనంతపురం జిల్లా ఏప్పుడు కూడా కాస్త స్పెషల్ గానే ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతరం జిల్లాలో 14 మంది టిడిపి ఎమ్మెల్యేలలో నలుగురు మహిళ నేతలే ఉన్నారు. రాప్తాడు నుంచి పరిటాల సునీతమ్మ, సింగనమల నుంచి బండారు శ్రావణి ,పుట్టపర్తి నుంచి పల్లె సింధూర రెడ్డి, పెనుగొండ అసెంబ్లీ నుంచి సవితమ్మ ఉన్నారు.వీరిలో ముగ్గురు బండారు శ్రావణి ,పల్లె సింధూర, సవిత మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బండారు శ్రావణి మొట్టమొదటిసారిగా ఎన్నికైనప్పటికీ రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

సవిత, సింధూర కొత్తవారు అయినప్పటికీ మొదటి సారి పోటీ చేసి మరి గెలిచారు. సింధూరకు ఆమె మామగారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బలమైన మద్దతు ఉండడం వల్ల గెలిచింది. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన నియోజవర్గం ఓటర్లు బాగా ఆయన కోడల్ని అక్కున చేర్చుకున్నారు. సింధూర రాజకీయాలకు కొత్త కావడం కూడా ఒక అడ్వాంటేజ్ గా మారిపోయింది దీంతో రాయలసీమలో మహిళా నేతలు కూడా తమ హవా చూపించారు.. ఇక పరిటాల సునీతమ్మ ఎన్నో ఏళ్లుగా ఉన్నది.

2005లో తన భర్త పరిటాల రవీంద్ర హత్య తర్వాత 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయింది. 2014 వరకు ఎమ్మెల్యే గానే కొనసాగింది 2019లో వైసీపీ పార్టీ నుంచి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గెలిచారు.. ఇప్పుడు 2024లో మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచింది. అంతేకాకుండా మంత్రివర్గంలో కూడా సునీతమ్మ పనిచేసింది. పెనుగొండ సవితమ్మ మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ ఓడించింది. అలాగే వైఎస్ఆర్సిపి సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే డి శ్రీధర్ ను పల్లె సింధూర ఓడించింది. సింధూర శ్రావణి చిన్నవారు అయినప్పటికీ సునీతమ్మ సవిత ఇద్దరు కలిసి 50 ఏళ్లు ఉన్నవారు. ఇందులో సులువుగా గెలిచింది సింధూరనే ఎందుకంటే తన మామ సపోర్టు వల్ల ప్రజా దారుణ వల్ల ఇమే సులువుగా అక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: