బాలయ్య: అక్కడ హ్యాట్రిక్ ఇక్కడ హ్యాట్రిక్..!

Divya
నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా మంచి విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు . అటు సినిమాలలో ఇటు పొలిటికల్ పరంగా కూడా భారీ విజయాలని అందుకుంటున్నారు. ఇప్పుడు బాలయ్య డబుల్ హ్యాట్రిక్ తో మంచి జోష్ మీద ఉన్నట్టుగా కనిపిస్తోంది.  ఇప్పటికే సినీ రంగంలో హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ అఖండ ,వీరసింహారెడ్డి , భగవంతు కేసరి వంటి సినిమాలతో ఫ్యాక్టరీకి విజయాన్ని అందుకున్నారు బాలయ్య.. ఇప్పుడు రాజకీయాలలో కూడా హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు పోటీ చేసి హ్యాట్రిక్ ని అందుకున్నారు.

రెండు పడవల పైన ఆయన ప్రయాణం చేసినప్పటికీ రెండు చోట్ల కూడా హ్యాట్రి కొట్టడం ఇప్పుడు అభిమానులలో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ విజయాలను బాలయ్య అభిమానులు గ్రాండ్ గానే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మా నాయకుడు సూపర్ అంటూ ఉండగా అభిమానులు మాత్రం మా నాయకుడు సూపర్ అంటూ తెగ ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా హిందూపురం ప్రజలు బాలయ్య పనితనానికి మెచ్చి ఇప్పటికే వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. మూడవ సారి టిడిపి ఎమ్మెల్యేగా బాలకృష్ణ అసెంబ్లీలో అడుగుపెట్టి తనదైన స్టైల్ లో ప్రజల కోసం పనిచేయాలని చూస్తున్నారు.

హిందూపురం నియోజకవర్గం లో బాలయ్య ప్రజలకు ఏదైనా కష్టం వస్తే చాలు ఆ కష్టాన్ని తెలుసుకొని మరి పూర్తి చేసేవారు.. ఇక సినిమాల విషయానికి వస్తే విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా అభిమానులను కూడా ఆకట్టుకొని సినిమాలలో నటిస్తూ ఉన్నారు బాలయ్య. సమాజం కోసం ఉపయోగపడేటువంటి సినిమా కథలతోనే ముందుకు వస్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్ బావి దర్శకత్వంలో తన 109వ సినిమాలో బాలయ్య నటిస్తూ ఉన్నారు. ఎలక్షన్ల ప్రచారం వల్ల సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం కావడంతో తిరిగి మళ్ళీ మొదలు పెట్టాలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈడ అదే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: