టీవీ: స్టార్ యాంకర్ తో రొమాన్స్ చేయబోతున్న యాంకర్ ప్రదీప్..!

Divya
తెలుగులో మేల్ యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు.. దాదాపుగా 14 ఏళ్లగా సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా రాణిస్తూ ఉన్నారు.. ఇప్పటికీ ఈటీవీలో కూడా వచ్చే షోస్ కి హోస్టుగా చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించారు. జీ తెలుగు, స్టార్ మా వంటి చానల్స్ లో కూడా యాంకర్ గా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొంచెం టచ్ లో ఉంటే చెబుతా అనే విషయం వల్ల మంచి పాపులారిటీ అందుకున్నారు ప్రదీప్. ఈటీవీలో వచ్చే ఢీ షో సైతం మంచి క్రేజీ తెచ్చిపెట్టింది.

ఆ ఇమేజ్ ద్వారా హీరోగా మారిపోయారు ప్రదీప్ మూడేళ్ల క్రితం ఆయన హీరోగా నటించిన  30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో నటించారు. ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ప్రదీప్ ఆ తర్వాత హీరోగా మరే సినిమాలో కూడా నటించలేదు.. మరొకవైపు మరి కొన్ని షోలలో యాంకర్ గా కంటిన్యూ అవుతూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా వివాహం చేసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు తాజాగా ప్రదీప్ ఒక కొత్త సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో ప్రదీప్ కి జోడిగా దీపిక బిల్లిని హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు సమాచారం ఇద్దరూ కూడా ఢీ షోతో పాపులర్ అయిన దీపిక పిల్లిని హీరోయిన్గా తీసుకుంటున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఈ సినిమా మాత్రం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ గురించి అటు డైరెక్టర్ నిర్మాత నుంచి పూర్తి వివరాలు తెలియజేయబోతున్నారట. టిక్ టాక్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న దీపికాపిల్లి.. ఢీ వంటి షో తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. కామెడీ స్టార్స్ వంటి సోలో కూడా యాంకర్ గా చేసి మంచి పాపులారిటీ అందుకుంది. అలాగే సుధీర్తో పండుగాడు, వాంటెడ్ సినిమాలలో కూడా నటించింది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: