కేసీఆర్‌ దెబ్బకు రేవంత్‌ భయపడ్డాడా.. అందుకే ఆ నిర్ణయం?

Chakravarthi Kalyan
తాను రోడ్డెక్కగానే రైతుబంధు  ప్రారంభించారని కేసీఆర్ అంటున్నారు. గ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస్ మెడలు వంచుతాం.. బీఆర్ఎస్ గెలిస్తేనే పథకాలన్నీ అమలవుతాయి.. రుణమాఫీ కోసం పోరాటం చేస్తామంటున్నారు కేసీఆర్. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ఏమైనా అభివృద్ధి జరిగిందా?.. ప్రధాని మోడీ హామీలు ఒక్కటన్న నెరవేరాయా?.. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కాదు.. దేశ్ కా సత్తేనాష్.. వికసిత్ భారత్ ఎక్కడుంది? మోడీ పాలన అంతా గ్యాస్.. గులాబీ జెండా ఎత్తిన నాడు నిజామాబాద్ జిల్లా నాకు అండగా నిలిచింది.. బీజేపీ ఎంపీ లను గెలిపిస్తే మోడీ వద్ద చేతులు కట్టుకుని నిలవాల్సిందే.. నవోదయ, మెడికల్ కాలేజి లు ఇవ్వని మోదీకి ఎందుకు ఓటేయాలి.. కాంగ్రెస్ పాలనలో నిజాంసాగర్ ప్రాజెక్టును ఎడారి చేశారని కేసీఆర్ అన్నారు.
మా పాలనలో కరెంటు కోతలు లేవు.. రేవంత్ రాగానే కోతలు మొదలయ్యాయి.. వరికి బోనస్ బోగస్ అయ్యింది.. ఐదు నెలల పాలనలో స్కాలర్ షిప్ లు, కేసీఆర్ కిట్లు, సిఎంఆర్ఎఫ్ లు ఆపేశారు.. చేనేత కార్మికుల ఆత్మహత్యలు మొదలయ్యాయి..  రేవంత్ చేసేది దేవుళ్ళ మీద ఒట్లు... కేసీఆర్ పై తిట్లు.. ముస్లిం మైనారిటీ లు కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీ గెలుస్తుంది.. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే అన్నారు కేసీఆర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: