"ఇండియన్ 2" తర్వాత అన్ని నెలలకు రిలీజ్ కానున్న "ఇండియన్ 3"..?

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ 1996 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా చాలా సంవత్సరాల తర్వాత శంకర్ , కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 అనే మూవీ ని మొదలు పెట్టాడు.

ఈ మూవీ లో సిద్ధార్థ్ , కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఇండియన్ సిరీస్ మూవీ లను రెండవ పార్ట్ తోనే ఆపివేయాలి అని అనుకున్నప్పటికీ కథ చాలా పెద్దది కావడంతో ఈ సినిమాని మరో భాగంతో పూర్తి చేయాలి అని మేకర్స్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఇప్పటికే మూడవ భాగం కు సంబంధించిన షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. కొన్ని రోజుల క్రితమే ఇండియన్ 2 మూవీ ని జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఆ తర్వాత ఈ మూవీ ని జూలై నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇండియన్ 2 మూవీ విడుదల అయిన తర్వాత ఆరు నెలలకు ఇండియన్ 3 మూవీ ని విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండియన్ 3 మూవీ కి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావడంతో చాలా తక్కువ రోజుల్లో ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఈ మూవీ ని కూడా ప్రేక్షకుల ముందుకు తక్కువ కాలంలో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: