యష్ దయాల్ సూపర్ పర్ఫార్మెన్స్.. రింకు సింగ్ పోస్ట్ వైరల్?

praveen
విజయం వచ్చినప్పుడు పొంగిపోకూడదు పరాజయం ఎదురైనప్పుడు కృంగిపోకూడదు అని చెబుతూ ఉంటారు పెద్దలు. మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగితే.. ఫలితం దానంతటదే వస్తుందని అంటూ ఉంటారు. అయితే ఇక ఇప్పుడు టీమిండియా క్రికెటర్ సక్సెస్ స్టోరీ వింటే ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. గత ఏడాది ఐపీఎల్ చివరి ఓవర్లో 29 పరుగులను డిఫెండ్ చేయలేకపోయిన యష్ దయాళ్ ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 కానీ అదే ఇటీవలే సంచలన బౌలింగ్ తొ 17 పరుగులు డిఫెండ్ చేసి ఆర్సిబి ని ప్లే ఆఫ్  చేర్చాడు. ఏడాది కాలంలోనే యష్ దయాల్ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. గతంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్గా కేకేఆర్ సంచలన రింకు సింగ్ దాటికి వరుసగా ఐదు బంతులలో 5 సిక్సర్లు సమర్పించుకొని.. జీరో అనిపించుకున్న యాష్ దయాల్ ఆర్సిబికి చిరస్మరణీయమైన విజయాన్ని అందించి ఇప్పుడు హీరో అనిపించుకుంటున్నాడు. రింకు సింగ్ దాటికి గత సీజన్లో తీవ్ర మానసిక వేదనకు అనారోగ్యానికి గురైన యష్ దయాల్ ఆ సీజన్లో మళ్ళీ బరిలోకి దిగలేదు.

 చివరికి గుజరాత్ టైటాన్స్ కూడా అతని వదిలేస్తుంది. అనూహ్యంగా అతనిని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐదు కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ జీరో ప్లేయర్ కి ఐదు కోట్లు పెట్టడం ఏంటి అని అందరూ విమర్శలు గుప్పించారు. ఐదు సిక్సర్లు ఇచ్చాడు కాబట్టి ఐదు కోట్లు పెట్టారేమో అంటూ సెటైర్లు వేశారు. అయితే వారి విమర్శలకు తగ్గట్లుగానే ఫస్ట్ ఆఫ్ సీజన్లో విఫలమయ్యాడు. కానీ సెకండ్ హాఫ్ సీజన్లో సంచలన ప్రదర్శనతో ఆర్సిబి విజయాలలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో 17 పరుగుల అవసరమవ్వగా బంతిని అందుకున్న యాష్ దయాల్ ఇక rcb కి విజయాన్ని అందించగలిగాడు. చివరి 4 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఆర్సిబి ప్లే ఆఫ్ చేయడంలో కీలకపాత్ర వహించాడు. దీంతో అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కాగా అతని ప్రదర్శన పై వావ్ సూపర్ ఇదంతా దేవుడి ప్లాన్ బేబీ అంటూ రింకు సింగ్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: