ఏపీ: ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న మూడు శాపాలు.. మరో జనరేషన్ బలి..??

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా సపరేట్ పేర్లతో పిలిచేవారు. ఏపీ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇలా విభజిత రాష్ట్రంగా ఉండేది. ఈ మూడు భాగాలను మూడు అంశాలు పీడించేవి. అందులో ఒకటి కమ్యూనిజం. కమ్యూనిస్టులు అనేవారు ఏదైనా కొత్త ఇండస్ట్రీ తమ ప్రాంతానికి వస్తుందంటే. అది తమ చెప్పు చేతల్లో ఉండాలి అనే ధోరణిని లేదా మనస్తత్వాన్ని చూపించేవారు. దానివల్ల నష్టపోవాలనే భయంతో ఇండస్ట్రీలు ఏవీ రాష్ట్రానికి వచ్చేవి కావు. ఉన్న ఇండస్ట్రీలను కూడా కమ్యూనిస్టు యూనియన్లు మూయించేసాయి. ఫలితంగా ఉపాధి అవకాశాలు లేక ఆంధ్ర ప్రజలు అల్లాడిపోయేవాళ్లు.
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడను ముంబైతో పోల్చేవారు. కావలి, గుంటూరు వంటి ప్రాంతాలు కూడా వ్యాపారాలకు రాజధానిగా ఉండేవి అలాంటి మంచి ప్రాంతాలలో రౌడీయిజం అనేది పెద్ద శాపం అయింది. ఇక్కడ ఈ రౌడీలు వ్యాపార కార్యకలాపాలలో జోక్యం చేసుకునేవారు. వారిని వేధించేవారు దీనివల్ల ఏపీలోని ఈ జిల్లాలలో వ్యాపారాలను విస్తరించకుండా తమ వ్యాపారాలను హైదరాబాద్ కి షిఫ్ట్ చేసుకున్నారు. ఇక రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎక్కువ.
సీమలో ఎక్కడైనా కంపెనీ లేదా ఇండస్ట్రీ పెట్టాలంటే అక్కడికి దొర పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. లాభాలు సంపాదించడం మాట అటు ఉంచితే వాళ్లకి కమిషన్లు ఇవ్వడంతోనే సరిపోయేది. అందువల్ల రాయలసీమ ప్రాంతంలో కూడా కొత్త ఇండస్ట్రీలు పుట్టుకు రాలేదు. అలా రౌడీయిజం, ఫ్యాక్షనిజం, కమ్యూనిజం - ఈ మూడు శాపాల కారణంగా ఆంధ్ర ప్రజలందరూ కూడా ఏపీలో ఎక్కడా స్థిరపడకుండా హైదరాబాద్‌, మిగతా నగరాలకు తరలిపోయారు.
 అయితే కొన్ని రాజకీయ పార్టీలు, జర్నలిస్టులు మళ్లీ ఆంధ్ర రాష్ట్రంలో రౌడీయిజం ఫ్యాక్షనిజం కమ్యూనిజం స్టార్ట్ చేస్తున్నారు. జోక్ ఏంటంటే వీరి ఆస్తులు వ్యాపారాలు అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం గొడవలు చేస్తూ ఇక్కడి ప్రజలు ఎదగకుండా చేస్తుంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి తెలంగాణ ఉద్యమం లాగా ఈ మూడిటికి వ్యతిరేకంగా పోరాడాలి. లేదంటే ఆంధ్ర ప్రదేశ్‌లో స్థిరపడడం కష్టం. వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం తప్ప వీరికి మరో మార్గం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: