తన పరువు తానే తీసేసుకున్న పవన్ కల్యాణ్?
అసలు మన వద్ద ఏముంది.. కార్యకర్తల బలముందా.. సంస్థాగత బలముందా.. ఎందుకు మనకు ఎక్కువ సీట్లు ఇస్తారని పవన్ కల్యాణ్ తన కార్యకర్తలనే ప్రశ్నించారు. తద్వారా తమ చేయి ఎప్పుడూ కిందేనని పరోక్షంగా క్యాడర్‌కు చెప్పినట్టయింది. 25 కిలోల బియ్యం ఇచ్చేందుకు కాదు.. 25 ఏళ్ల భవిష్యత్తు ఇచ్చేందుకు నేను ఉన్నానన్న పవన్ కల్యాణ్ రాజ్యాధికారం ఎలా సాధ్యమో మాత్రం చెప్పలేదు. గూండా ఎమ్మెల్యేలకు ఎలాంటి కండక్ట్ సర్టిఫికెట్లు అక్కర్లేదని.. యువత ఉద్యోగాల కోసం మాత్రం కండక్ట్ సర్టిఫికెట్లు కావాలని.. మన కండక్ట్ ఇచ్చే నాయకులు.. మన కంటే ఉన్నతంగా ఉండాలని పవన్ అన్నారు.