కేసీఆర్.. ఇది ప్రజాస్వామ్యం?
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ వంటి వారి వైఖరి ప్రజాస్వామ్యయుతంగా కనిపించట్లేదని.. రాజరికపు పోకడలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. మనది ప్రజాస్వామ్యం.. ఇది రాజరికం కాదన్న చర్చ జరుగుతోంది. అందుకే పథకాలు బాగున్నా.. పెద్దగా పాలనలో ఇబ్బందులు లేకున్నా.. పదేళ్ల తర్వాత కేసీఆర్ పాలన అంటే విముఖత కనిపిస్తోందన్న వాదన ఉంది. మరి జనం ఏం తీర్పు చెబుతారో డిసెంబర్ 3 తర్వాత కానీ తెలియదు.