వైఎస్‌ షర్మిల మాట.. పట్టించుకునేవారేరీ?

Chakravarthi Kalyan
నిరుద్యోగుల పక్షాన పోరాటానికి కలిసి రావాలని వైఎస్‌ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. లేఖలు రాస్తున్నారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి నిరుద్యోగుల కోసం పోరాడే సమయం ఆసన్నమైందని వైఎస్‌ షర్మిల అంటున్నారు. ఈ పోరాటానికి జాయింట్ ఆక్షన్ కమిటీ ఇప్పుడు చారిత్రక అవసరమని వైఎస్‌ షర్మిల  స్పష్టం చేశారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, తెలగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్‌, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, మందకృష్ణ మాదిగ, సీపీఎం నేత తమ్మినేత వీరభద్రం, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు,ఎన్ శంకర్ గౌడ్‌లకు వైఎస్‌ షర్మిల లేఖలు రాశారు.

ఉమ్మడి కార్యాచరణను రూపొందించి మోసపోయిన నిరుద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే  వైఎస్‌ షర్మిల మాటలను పట్టించుకునేవారే కరవవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: