ఆ విషయంలో ఏపీకి అన్యాయమే జరుగుతోందా?

Chakravarthi Kalyan
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్‌ కార్డు లబ్ధిదారుల ఎంపికలో ఏపీకి అన్యాయం జరుగుతోందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. కేంద్ర రాష్ట్రానికి చెందిన సంబంధిత శాఖల అధికారులతో ఇటీవల సమావేశమైన నీతిఆయోగ్‌ ఈ విషయాన్ని గుర్తించిందట. ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి బియ్యం తక్కువగా ఇస్తున్నట్టు గుర్తించిందట. దీన్ని వెంటనే పునఃసమీక్షించాలని సిఫారసు చేసిందట. జాతీయ ఆహారభద్రతా చట్టం కింద ఇస్తున్న బియ్యంలో దేశంలో నెలకు 3 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ ఉందట. ఇందులో రాష్ట్రానికి కేటాయింపులు చేస్తే సరిపోతుందంటూ నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసిందట. నెలకు 0.77లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అదనంగా రాష్ట్రానికి ఇవ్వాలంటూ నీతిఆయోగ్‌ కేంద్రానికి సిఫార్సు చేసింది. అలాగే ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద కూడా ఏపీకి తక్కువ కేటాయింపులు ఉన్నాయి. దాదాపు 56 లక్షల కుటుంబాలు ఏపీలో ఈ పథకం కింద కవర్‌ కావడంలేదట. అందువల్ల వీరికిచ్చే బియ్యం సబ్సిడీ భారాన్ని రాష్ట్రం భరించాల్సి వస్తోందట. ఈ విషయాల్లో న్యాయం చేయాలని ఇటీవల ప్రధానిని కలిసిన సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: