ఉక్రెయన్‌కు అమెరికా సపోర్ట్.. రష్యాకు భారీ నష్టం?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి అందుతున్న అండదండలతో రష్యాకు భారీ నష్టం జరుగుతోందట. ఇప్పటివరకూ ఉక్రెయిన్ జరిపిన ఎదురు దాడుల్లో రష్యా భారీగా బలగాలతోపాటు సైనిక జనరళ్లను కోల్పోయింది. మునుపెన్నడూ లేనివిధంగా రష్యాకు సైనిక నష్టం జరుగుతోందని తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు అమెరికా అండదండలే ఈ నష్టానికి కారణమన్న వాదన వినిపిస్తోంది. రష్యా ఇప్పటి వరకూ యుద్ధంలో పదుల సంఖ్యలో సైనక జనరళ్లను కోల్పోయింది. గతంలో ఏ యుద్ధంలోనూ రష్యా ఈ స్థాయిలో సైనిక జనరళ్లను కోల్పోలేదు. అమెరికా నిఘా వర్గాలు సహాయం కారణంగా ఉక్రెయిన్ గురి చూసి దెబ్బ కొడతోందని రష్యా అనుమానిస్తోంది. రష్యా బలగాల కదలికలను అమెరికా నిఘా విభాగం ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అందిస్తున్నట్లు రష్యా అనుమానిస్తోంది. అమెరికా  ఇచ్చిన సమాచారంతోపాటు ఉక్రెయిన్ సొంత నిఘావ్యవస్థ ద్వారా కూడా రష్యా జనరళ్లపై ఎదురుదాడులు జరుపుతున్నట్లు రష్యా భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: