వారెవా.. అమెరికా గూడఛార విభాగంలో ఇండియన్‌?

Chakravarthi Kalyan
అమెరికాలో మన ఇండియన్లు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇండియన్‌కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా గూఢాచార సంస్థ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో తొలి ముఖ్య సాంకేతిక అధికారిగా ఇండియన్ మూలాలున్న నంద్ మూల్‌ చందనీ నియమితులు అయ్యారు. నంద్ మూల్‌ చందనీకు సిలికాన్ వ్యాలీలో 25 ఏళ్లకు పైగా పనిచేసిన అనుభవం ఉంది. అలాంటి మూల్‌ చందనీ కొన్నాళ్లుగా రక్షణ శాఖలో సేవలందిస్తున్నారు.
ఈ మూల్‌చందనీని సీఐఏ సీటీవోగా నియమిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ విలియమ్‌ జే బర్న్స్‌ ధ్రువీకరించారు. ఇక ఈ నంద్ మూల్‌ చందనీ ఫ్లాష్ బ్యాక్ ఒకసారి చూస్తే.. నంద్ మూల్‌ చందనీ దిల్లీలోని బ్లూబెల్స్‌ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివాడు.. అక్కడ 1979 నుంచి 1987 వరకు మూల్‌చందనీ చదివాడు. ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్, హర్వర్డ్‌ విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీ పొందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

CIA

సంబంధిత వార్తలు: