ఉక్రెయిన్‌ యుద్ధంలో పాపం.. 32 లక్షల మంది?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్‌ పై యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ 32 లక్షల మంది ఉక్రెయిన్ వాసులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని దేశం వీడివెళ్లిపోయారట. అంతే కాదు.. సుమారు 65 లక్షల మంది నిరాశ్రయులయ్యారట. ఇవీ ఐక్యరాజ్యసమితి నివేదికలు వెల్లడిస్తున్న వాస్తవాలు. యుద్ధం నాలుగోవారం నడుస్తున్నా ఇంకా చర్చల్లో చెప్పుకోదగ్గ ఫలితం కనిపించడం లేదు. ఉక్రెయిన్‌-రష్యా చర్చల సారాంశాన్ని  బయటపెట్టబోననీ జెలెన్‌ స్కీ అంటున్నారు. ఫేస్‌బుక్‌, రేడియో, టీవీల్లో చర్చించడం కంటే మరింత ఎక్కువగా పనిచేయడమే సరైన విధానమని నమ్ముతున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంటున్నారు. నాటోలో చేరాలన్న ప్రతిపాదనను ఉక్రెయిన్‌ విరమించుకోవాలని రష్యా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తటస్థ స్థితిని అవలంబించే విషయంలో  ఒప్పందం కుదుర్చుకునే దిశగా ఇరుదేశాలు దగ్గరగా వచ్చాయని రష్యా చెబుతోంది. మరి ఈ యుద్ధం ముగిసేలోపు ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాల్సి ఉంటుందో.. ఇంకెంత నరమేథం జరగాల్సి ఉందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: