వెల "సిరి" : జ‌న‌నీ జ‌న్మ‌భూమిలో ఆరంగేట్రం చేయ‌డం నా అదృష్టం : బాల‌కృష్ణ

N ANJANEYULU
సాహిత్యానికి పురుషుడు సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. సిరివెన్నెల మ‌ర‌ణం నాకు తీర‌ని లోట‌ని, తాను పుట్టిన జాతికి కీర్తి ప్ర‌తిష్ట‌లు తీసుకొచ్చారు. వారు ఉన్నా లేకున్నా శాశ్వ‌తంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. 1984లో నేను న‌టించిన జ‌న‌నీ జ‌న్మ‌భూమి సినిమాలో సీతారామ‌శాస్త్రి ఆరంగ్రేటం చేయ‌డం నా పూర్వ‌జ‌న్మ‌లో చేసుకున్న పుణ్య‌మే అని పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న లేడంటే శోక సంద్రంలో మునిగిపోయార‌ని చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న ఎక్క‌డ క‌లుసుకున్నా స‌ర‌దాగా ఉంటారు. సాహిత్యం గురించి ఇద్ద‌రం క‌లిసి మాట్లాడుకునే వాళ్లం. మూడే వేల పాట‌లు రాయ‌డం అంటే మాట‌లు కాదు.. ఆయ‌న ర‌క‌ర‌కాల పాట‌లు రాసి ఆయ‌న త‌న ప్ర‌తిభ‌ను చాటుకున్నారు. విప్ల‌వాత్మ‌క‌, మాస్‌, క్లాస్, తల్లి, అన్న వంటి ప్రేమ‌కు సంబంధించి అవి ఇవి  అని తేడా లేకుండా అన్ని ర‌కాల‌కు సంబంధించిన పాట‌లు రాసి రికార్డు సృష్టించారని గుర్తు చేసారు.
2019లో కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌శ్రీ అవార్డును ఇచ్చి గౌర‌వించార‌ని, అలాగే ఆయ‌న స్థానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేర‌ని గుర్తు చేసారు. పుట్టిన వాడు గిట్ట‌క త‌ప్ప‌ద‌ని. భ‌గ‌వంతుడు తీసుకెళ్లాడు. ఇకొంన్నాళ్ల పాటు ఆయ‌న సేవ‌లుంటే బాగుండు అని అభిప్రాయ ప‌డ్డారు బాల‌కృష్ణ‌. ఆయ‌న కుటుంబ స‌భ్యులంద‌రికీ నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాన‌ని పేర్కొన్నారు బాల‌య్య‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: