పోటెత్తిన‌ పెన్నా.. తెగిన కోవూరు హైవే..!

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల‌లో భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో న‌దులు ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. ముఖ్యంగా పెన్నా న‌ది పోటెత్తుతున్న‌ది. దామ‌ర‌మడుగు వ‌ద్ద 16వ నెంబ‌ర్ చెన్నై-కోల్‌క‌తా జాతాయ ర‌హ‌దారి వ‌ర్షం ధాటికి ఒక్క‌సారిగా కోత‌కు గురైన‌ది. వాహ‌నాల‌ను ముందుకు క‌ద‌ల‌కుండా చేసిన‌ది. విజ‌య‌వాడ‌-నెల్లూరు మ‌ధ్య రాక‌పోక‌ల‌కు అంత‌రాయమేర్ప‌డింది. ఒకేవైపు నుంచి రాక‌పోక‌లు సాగుతుండ‌డంతో దాదాపు 5 కిలో మీట‌ర్ల వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోయాయి.

ప‌లు మార్గాల‌లోని వాహ‌నాల‌ను అధికారులు దారి మ‌ళ్లించారు. తిరుప‌తి నుంచి శ్రీ‌కాళ‌హ‌స్తిమీదుగా వెళ్లే వాహ‌నాల‌ను తొట్టంబేడు చెక్‌పోస్ట్ వ‌ద్ద నిలిపి వేసారు.  వాహ‌న‌దారులు క‌డ‌ప‌, పామూరు, ద‌ర్శి వైపు వెళ్లాల‌ని సూచన‌లు చేశారు. ప్ర‌కాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వ‌ద్ద వాహ‌నాలు భారీ సంఖ్య‌లో రోడ్డుపైనే నిలిచిపోయాయి. ఒంగోలు-నెల్లూరు మార్గంలో రాక‌పోక‌ల బందయ్యాయి. సంగం మండ‌లం కోల‌గ‌ట్ల వ‌ద్ద ముంబై హైవేపై వ‌ర‌ద త‌గ్గ‌డంతో పోలీసులు వాహ‌నాల‌కు లైన్ క్లియ‌ర్ చేసారు. నెల్లూరు నుంచి క‌డ‌ప వైపున‌కు  వెళ్లే వాహ‌నాల‌కు అనుమ‌తి ఇస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: