ఇలా కూడా మోసపోతారు జాగ్రత్త!

Chaganti
ఈ మధ్య కాలంలో అన్ని మోసాల కంటే ఎక్కువగా సైబర్ క్రైం మోసాలు ఎక్కువయ్యాయి. ఈజీగా మోసగాళ్ళకు ఎరలు దొరికిపోతూ ఉండడంతో ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడిన ఆఫ్రికా దేశానికి చెందిన ముగ్గురు నైజీరియన్లు, మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలను కర్నూలు సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. హెర్బల్ నూనె పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఐడీ ద్వారా వీరు భారీ ఎత్తున మోసాలు చేసినట్లు గుర్తించారు. అంతే కాక అరెస్ట్ చేసిన సమయంలో 12 లక్షల 94 వేల, 859 రూపాయలు ఫ్రీజ్ చేసారు. అంతే కాక 16-బ్యాంక్ అకౌంట్ బుక్స్, 33-ATM డెబిట్/క్రెడిట్ కార్డులు, 2- చెక్ బుక్స్, 9-సెల్ ఫోన్లు,3-లాప్ టాప్ లు, 3-ఫారిన్ పాస్ పోర్ట్, 2 ఆధార్ కార్డులు కూడా కర్నూలు సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: