అంతర్వేది బీచ్‌లో దారుణం.. మహిళ మృతి..!

Chakravarthi Kalyan
సముద్రుని ఉగ్రరూపానికి ఓ మహిళ బలైంది. తూర్పుగోదావరి జిల్లా సఖీనేటిపల్లి మండలం అంతర్వేది బీచ్ లో సముద్ర స్నానం చేస్తూ లద్దిక కుమారి అనే 33 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఈ బీచ్‌లో మొత్తం పదకొండు మంది సముద్ర స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీగా వచ్చిన అలల ఉద్ధృతితో నలుగురు మహిళలు సముద్రంలోకి కొట్టుకుపోయారు.


వీరిలో ముగ్గురు సురక్షితంగా బయటకు వచ్చారు. ఓ మహిళ మాత్రం మృతి చెందింది. మృతి చెందిన లద్దిక కుమారిని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. రాజమండ్రి లోని బంధువులు ఇంటికి వచ్చిన లద్దిక కుమారి అంతర్వేది బీచ్ లో సరదాగా గడుపుతున్న  సందర్భంలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాల తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: