యువతిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు..!
ఆ యువతికి క్వికర్ డాట్ కామ్ నుంచి మాట్లాడుతున్నామని మభ్య పెట్టారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మీకు జాబ్ కన్ఫామ్ అయిందని మాయమాటలు చెప్పారు. ఉద్యోగం కోసం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని చెప్పారు. తమ ఖాతాలో లక్ష రూపాయలకు పైగా వేయించుకున్నారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఆఫ్ చేసేశారు. ఆ తర్వాత ఎంతకూ ఆ ఫోన్ కలవకపోవడంతో ఆ యువతికి మోసం అర్థమైంది. సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. సైబర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.