సడెన్ గా లాక్ డౌన్ అంటే ఎలా..?? హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!
తెలంగాణలో లాక్ డౌన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఏమని ప్రశ్నించిందంటే.. “సడెన్ గా లాక్ డౌన్ అంటే ఎలా. ఇతర రాష్ట్రాల ప్రజలు ఎలా వెళ్లి పోతారు. కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన లేకుండా సడెన్ గా లాక్ డౌన్ ఏంటి. తక్కువ టైంలో ఇతర రాష్ట్రాల ప్రజలు ఎలా వెళ్తారు. నేడు ఉదయం వరకు ప్రభుత్వానికి కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన కూడా లేదు. కానీ నేడు అనూహ్యంగా ఈ నిర్ణయమేంటి..?? అని హైకోర్టు తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.