మొదటి దశ, రెండో దశతో పోల్చితే.. మూడో దశలో ఆ సంఖ్య కొంచెం ఎక్కువే...
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఛాలెంజింగ్‌గా తీసుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. మూడో దశలో నోటిఫికేషన్ ఇచ్చిన 3,221 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు గాను 579 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 31,516 వార్డు మెంబర్లకుగాను 11,753 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవ పంచాయతీలు మినహా మిగిలిన 2,640 పంచాయతీలకు.. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, మొదటి దశలో 525 స్థానాలు ఏగ్రీవం కాగా.. రెండో దశలో అన్ని జిల్లాల్లో కలిపి 539 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే మొదటి, రెండో విడతతో పోల్చితే మూడో దశలో ఏకగ్రీవాల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం.