బ్రేకింగ్ : ఏపీఎస్‌ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి షాక్... విధులకు రావొద్దంటూ ఫోన్లు...?

Reddy P Rajasekhar

దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా విజృంభణ వల్ల రాష్ట్రాలు పరిమిత సంఖ్యలోనే బస్సులకు అనుమతులు ఇస్తున్నాయి. తక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతుండటంతో అధికారులకు కాంట్రాక్ట్ ఉద్యోగుల అవసరం లేకుండా పోయింది. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి అధికారులు భారీ షాక్ ఇచ్చారు. కాంట్రాక్ట్‌ ముగిసిందని విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదంటూ ఫోన్లు చేసి చెప్పారు. 
 
గతంలో మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించబోమని ప్రకటన చేశారు. కానీ అధికారులు విధులకు హాజరు కావొద్దంటూ ఫోన్లు చేయడంతో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. 7800 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఆర్టీసీ ఆఫీసు నుంచి ఫోన్లు రావడంతో ఆందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: