భారత్ లో తగ్గని కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే..?

praveen

దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఏకంగా ప్రతిరోజూ 10 వేలకు పైగా కొత్త కరోనా  కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో కరోనా  కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇక గడచిన 24 గంటల్లో ఏకంగా దేశ వ్యాప్తంగా 11502 కొత్త కరోనా  కేసులు  నమోదయ్యాయి... అంతేకాకుండా 24 గంటల్లోనే 325 మంది మరణించారు.

 

 ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తంగా నమోదైన కరోనా  కేసుల సంఖ్య 3,32, 424 చేరింది.  ఇక ఇప్పటి వరకూ 1,53,106 మంది యాక్టీవ్ కేసులు ఉండగా..  1,69,798 కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 9520 కరోనా  మరణాలు సంభవించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: