లోక్ సభ: ఎన్నికల వేళ పట్టుకున్న సొమ్ము ఎంతంటే..?

Divya
దేశంలో 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి షెడ్యూల్ లో భాగంగా చివరి ఎన్నికల విడత రేపటి రోజున జరగబోతోంది. ఈ మేరకు గురువారం సాయంత్రం ప్రచారానికి తెరపడిపోయింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చి నాటి నుంచి మే 30వ తేదీ వరకు ఐటీ శాఖకు భారీగానే కాసుల వర్షం కురిసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల వేరా భారీగానే బ్లాక్ మనీని పట్టుకోవడం జరిగింది.ఈ క్రమంలోని పక్క సమాచారంతో ఇన్కమ్ టాక్స్ అధికారులు దేశవ్యాప్తంగా నిర్వహించిన సోదరులు భారీగానే నగదు బంగారం వంటివి సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ లో భాగంగా దేశవ్యాప్తంగా పన్ను శాఖ నిర్వహించినటువంటి సోదలలో సుమారుగా 1100 కోట్లకు పైగా నగదు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.మే 30వ తేదీన ఆదాయ పన్ను శాఖ మొత్తం 1100 వందల కోట్ల డబ్బుతో పాటు బంగారాన్ని కూడా పట్టుకుంది. 2019తో పోలిస్తే ఈసారి 182 శాతం అధికంగా ఉందంటూ అధికారులు సైతం వెల్లడించారు. గత లోక్సభ ఎన్నికలలో కేవలం 390 కోట్ల రూపాయల నగదును మాత్రమే సీజ్ చేసినట్లు తెలియజేశారు.
ఈ సంవత్సరం  మార్చ్ 16 నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువలన నాటి నుంచి ఐటి శాఖ అన్ని రాష్ట్రాలలో కూడా పలు రకాల సోదాలను తనిఖీలను సైతం చేసింది. ఓటర్లను సైతం ప్రభావితం చేసేందుకు చాలామంది రాజకీయ నేతలు ఉపయోగిస్తున్న డబ్బుని సైతం సీజ్ చేసినట్లుగా తెలియజేశారు.. తమిళనాడు ఢిల్లీ కర్ణాటక ఇతరత్న రాష్ట్రాలలో భారీగానే నగదు పట్టు కున్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఈ మూడు రాష్ట్రాలలోనే వందల కోట్ల రూపాయలు నగదు బంగారాన్ని సైతం పట్టుకున్నట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు.. తమిళనాడులో 150 కోట్ల రూపాయల నగదును సైతం సీజ్ చేశామని అలాగే తెలంగాణ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాలలో మొత్తం మీద కలుపుకొని 100 కోట్లకు పైగా సీజ్ చేసినట్లు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: